calender_icon.png 6 March, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు

06-03-2025 06:53:14 PM

టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిన బిజెపి నాయకులు, కార్యకర్తలు..

బాన్సువాడ (విజయక్రాంతి): బిజెపి బలపరిచిన పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తాడుకోల్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... బిజెపి బలపరిచిన పట్టభద్రులు ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీని ఓటు వేసి గెలిపించిన ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, యువతకు, మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేశారు.

ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ శంకర్ గౌడ్, చిదుర సాయిలు, బిజెపి రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, బిజెపి నాయకులు కొనాల గంగారెడ్డి, పాశం భాస్కర్ రెడ్డి, చిరంజీవి, సాయి రెడ్డి, శివశంకర్, పిరాజి, దత్తు, లక్ష్మణ్, శివకుమార్, గణేష్, అంజయ్య, ఉమేష్, నాగరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.