calender_icon.png 31 October, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాబూల్‌లో సంబురాలు

26-06-2024 01:04:21 AM

అంతర్జాతీయ క్రికెట్‌లో తమ జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చి.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరడంతో అఫ్గాన్ వీధుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా.. క్రీడాభిమానులంతా వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెగాటోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించిన అఫ్గాన్.. సూపర్ చివరి పోరులో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో కాబూల్‌లో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చిన ప్రజలు.. సంబరాలు జరుపుకున్నారు.