calender_icon.png 24 November, 2024 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమక్షంలో సంబురాలు

31-12-1899 12:00:00 AM

15 రోజులపాటు నిర్వహణ

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్ సిటీ, నవంబరు 23: ప్రజా పాలనలో ప్రజలు, పార్టీ శ్రేణులు, రైతులు, కార్మికుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వహిస్తామని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. నేటి నుంచి 15 రోజులపాటు నియోజకవర్గంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. శనివారం నగర కాంగ్రెస్ కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని అన్ని డివిజన్ల బాధ్యు లందరిని సమన్వయపర్చుకొని కాంగ్రెస్ జెండాలను ఆవిష్కరిస్తామన్నారు.

ఈ జెండా పండుగలో సబ్బండ వర్గాలు పాల్గొంటాయన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ముందుకు వెళ్తుంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు రోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతిలో నిండా మునిగిన ఈ ఎమ్మెల్యేలు ప్రజాపాలనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో ఈ సంవత్సరకాలంలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కుల మతాలను రెచ్చగొడుతూ తెలంగాణలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు ప్రకాశ్ నాయక్, వెన్నం రజిత, తదితరులు పాల్గొన్నారు.