calender_icon.png 8 February, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాజపా ఆధ్వర్యంలో చేగుంటలో సంబరాలు

08-02-2025 08:53:32 PM

చేగుంట (విజయక్రాంతి): ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం ఎంతో సంతోషకరమైన విషయమని చేగుంట మండల అధ్యక్షుడు చింతల భూపాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మొగించడంతో మండల కేంద్రంలో భాజపా శ్రేణులు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చింతల భూపాల్ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి అమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ఓటర్లు వారి చీపురుతోనే ఊడ్చేశారన్నారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు అని గుర్తించి ఢిల్లీ ఓటర్లు వారిని ఢిల్లీ పీఠం నుంచి దొబ్బేసి..ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై ఢిల్లీ పీఠం ఎక్కించారన్నారు.

ఇక కాంగ్రెస్ దేశంలో ప్రజలకు వ్యతిరేకంగా పోరాటాలు, ప్రజలకు అవసరం లేని మాటలు, ప్రజలు ఇక నమ్మరు అనే విషయం తేటతెల్లమైందన్నారు. ఇక మన రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బిజెపి విజయ దుందుభి మోగించాలని, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి,ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకునే దిశగా ప్రయత్నం చేయాలని, సమైక్య భావనతో అందరం కలిసి పోరాడి మెజార్టీ సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కరణం గణేష్ రవి కుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ కృష్ణ, ఉపాధ్యక్షులు మేకల రమేష్ ప్రధాన కార్యదర్శి కుమ్మరి నర్సింలు, బాహుబలి నాగరాజు, సీనియర్ నాయకులు రఘువీర్, వేణు బిక్షపతి, సత్యం, సోమ సురేష్ తదితరులు పాల్గొన్నారు.