calender_icon.png 9 February, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో బిజెపి విజయం పట్ల సంబరాలు

08-02-2025 06:43:17 PM

తుంగతుర్తి: బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావ్ మాట్లాడుతూ... ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ లో బిజెపి పార్టీ విజయంతో నరేంద్ర మోడీ నాయకత్వం మరింత బలపడింది అని, యువత మేధావులు నరేంద్ర మోడీ వైపే ఉన్నారని మరొకమారు రుజువైనది పేర్కొన్నారు. లిక్కర్ రాజకీయానికి నేటితో చరమ గీతం పాడారు అని అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బిజెపి విజయం సాధిస్తుందన్నారు. రావణ సంస్థ కథ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడి లాగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు, మండల అధ్యక్షులు నారాయణదాస్, నాగరాజు కత్తుల నరేష్, సుధాకర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.