calender_icon.png 20 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో వేడుకలు

27-03-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : హైదరాబాద్ మెట్రోలో నేటి నుంచి ఉగాది మెట్రో ఫెస్ట్ వేడుకలను మెట్రో అధికారులు నిర్వహించనున్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో నేటి నుంచి 29వ తేదీ వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ఉగాది, మెట్రో ఫెస్ట్‌ను నిర్వహించ డం పట్ల హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కెవిబీరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉగాది వేడుకల్లో ప్రయాణికులను భాగస్వామ్యం చేసి వారికి మంచి ఆనందాన్ని మిగిల్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకొనేందుకు ఒక అవకాశమన్నారు. ఇదిలా ఉండగా ఎర్రమంజిల్ లోని ప్రీమియా మాల్‌లో నేటి నుంచి 29వరకు మెట్రో ఆర్ట్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి కళాకారుల ప్రదర్శనలు అక్కడ ఉంటాయి.