calender_icon.png 31 October, 2024 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షలోపు రైతు రుణాలు మాఫీ.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు షూరూ

18-07-2024 10:13:21 AM

హైదరాబాద్: తెలంగాణలో గురువారం రూ.లక్ష లోపు రుణాల మాఫీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నేరుగా 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ బ్యాంకులకు జమ చేసింది. ఆగస్టు పూర్తయ్యేలోపు 3 దశల్లో రైతుల రుణమాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ నేతల సమావేశంలో ప్రకటించారు. ఈ నెలాఖరులోపు రూ. 1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ , ఆగస్టులో రూ. 2లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. ఇవాళ గ్రామ, మండల కేంద్రాల్లో రుణమాఫీ సంబురాలు అంబరాన్ని తాకనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర సంబరాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

అటు తెలంగాణ రైతుల పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేయడంతో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ మొదటి లిస్టు ప్రకటించడంతో జనగాం జిల్లా దేవరుప్పుల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు.