calender_icon.png 30 November, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేసింది చెప్పడానికే విజయోత్సవాలు

30-11-2024 12:33:51 AM

ఎమ్మెల్యే కుంభం  అనిల్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఏడాది పాలనలో ప్రజలకు చేసిన పనులను చెప్పేందుకు సీఎం రేవంత్‌రెడ్డి  ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలోనే 50వేల ఉద్యోగాలు, రూ.18వేలకోట్ల రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని స్పష్టం చేశారు.

రైతు భరోసా కింద అన్నదాతలకు రూ.7,625కోట్లు అందించామని, రైతు బీమా రూ.1,455 కోట్లు, పంటల బీమా రూ.1,300 కోట్లు కేటాయించామన్నారు. ఉచిత విద్యుత్‌కు రూ.10,444 కోట్లు ఖర్చు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. సన్న వడ్ల బోనస్‌కు రూ.5,040కోట్లు ఇచ్చామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఏడాదిలోనే ఇన్ని మంచి పనులు చేసిన తాము విజయోత్సవాలు ఎందుకు చేసుకోవద్దని ఆయన ప్రశ్నించారు.