calender_icon.png 6 February, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణ ఆమోదంతో దళిత వర్గాల సంబురాలు

06-02-2025 12:00:00 AM

సీఎం రేవంత్, మంత్రివర్గానికి క్షీరాభిషేకం

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి ): వర్గీకరణ అంశంపై ఏక సభ్య కమిషన్ సిఫార్సులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో దళిత వర్గాల్లో అంబరాలు సంబరాన్ని అంటాయి. మంగళవారం నాడు వందల మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ  చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఫ్లెక్సీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.మూడు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆమోదించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రిటైర్డ్ జస్టిస్ ఏకసభ్య కమిషన్ సభ్యులు షమీం అత్తర్, వర్గీకరణ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,వైస్ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్,ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ప్రీతం, ఎమ్మెల్యేలు ఎంపీలకు ప్రభుత్వ విప్పులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, దర్గాయి హరిప్రసాద్, నాగారం శంకర్, కనుకుంట్ల బాబురావు, మాజీ కౌన్సిలర్లు  ఈరప్ పాక నరసింహ, పడి గల ప్రదీప్, ఎండి సలావుద్దీన్, పులిగిల్ల బాలయ్య, కొండాపురం గణేష్, రఘు, చుక్క స్వామి, నరేష్, సురేష్, బట్టు సందీప్, కొండమడుగు అశోక్, యాదగిరి, గ్యాస్ చిన్న, ఢకూరి ప్రకాష్, బర్రె నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు