పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఫిబ్రవరి 2 : పటాన్ చెరు పట్టణంలో వసంత పంచమి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఆదివారం వైభవంగా జరిగాయి. వసంత పంచమి పురస్కరించుకొని బెంగాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.
గత 25 సంవత్సరాలుగా స్థానిక బెంగాలీలు వసంత పంచమి పురస్కరించుకొని సరస్వతి దేవి పూజలు నిర్వహించడం ఆనవాయితిగా వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్ సి పురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, దశరథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.