01-03-2025 05:50:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): పదవ తరగతిలో ప్రతి ఒక్క విద్యార్థి ఏ గ్రేడ్ లో పాస్ అయి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సోఫీ నగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డేనియల్ పిలుపునిచ్చారు. శనివారం 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు సెలబ్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరు సంవత్సరాల పాటు పాఠశాలలో చదివిన విద్యార్థులు పదోతరగతి అనంతరం ఉన్నత చదువులకు ఎక్కడికి వెళ్లినా పాఠశాలను మర్చిపోవద్దని ఉపాధ్యాయులు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.