calender_icon.png 21 February, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

19-02-2025 07:16:53 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ హిందూ సైన్యం, హిందూ బంధువులు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్ నుండి మార్కెట్, పాల చెట్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ... చత్రపతి శివాజీ బాల్యం లోనే అనేక  కోటలను జయించి, గెరిల్లా యుద్ధంతో తన సామ్రాజ్యాన్ని నిర్మించాడని, భారతదేశ చరిత్రలో చత్రపతి శివాజీ త్యాగం, భారతదేశము యొక్క సంస్కృతి పరిరక్షకుడిగా, దేశంలోని అన్ని వర్గాలకు అద్భుతమైన పాలన అందించారని అన్నారు, తన రాజ్యంలో మహిళలు, పిల్లలను గౌరవించేవాడని ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకొని దేశ సంస్కృతిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సైన్యం సభ్యులు పాల్గొన్నారు.