21-02-2025 06:49:43 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగు పండితులు డా. గొల్లపల్లి గణేష్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ గొల్లపల్లి గణేష్ మాట్లాడుతూ... అంతర్జాలంలో తెలుగు వినియోగం- విస్తృత అవకాశాలు అంశంపై ప్రసంగించారు. అంతర్జాలంలో తెలుగు ఉపకరణాలు ఉపాధి అవకాశాలు గురించి విద్యార్థులకు పి.పి,టి ద్వారా వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార తెలుగు అభివృద్ధి మార్గాలను వివరించారు. మాతృభాషలో పరిశోధనలు చేయాలని సూచించారు.
కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. సంతోష్ మహాత్మా అధ్యక్షత వహించి మాట్లాడుతూ... విద్యార్థులు తెలుగు భాషలో సృజనాత్మక నైపుణ్యం సాధించాలని పేర్కొన్నారు. కళాశాలలో తెలుగు విభాగం నిర్వహించే కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి తెలుగు విభాగం అధ్యక్షులు డా. తన్నీరు సురేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం గొల్లపల్లి గణేష్ గారిని ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జాడిశంకరయ్య, అధ్యాపకులు సంతోష్ కుమార్, ప్రేమలత, డా. తిరుపతి, నాగేశ్వర్, రాజ్ కుమార్, శ్రీనివాస్, చంద్రశేఖర్, సంధ్యారాణి, కవిత, ఇందు, వినయ్, స్వామి, బోధనేతర సిబ్బంది మల్లారెడ్డి, నిషంత్ శ్రీనివాస్, సునీత, లత మల్లారెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.