మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గణితశాస్త్రం దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్ధి విద్యార్థినిలు గణిత శాస్త్ర వచనం గుర్తులతో 5 రంగవల్లులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో, వివిధ రకాల గణిత శాస్త్ర నమూనాల (మోడల్స్)తో ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరుగగా వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆనంతరం పాఠశాలలో నిర్వహించిన ఆహార దినోత్సవంలో విద్యార్థులు విభిన్న రుచులతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.