06-03-2025 02:56:32 PM
హైదరాబాద్: బేగంపేట వివంతా హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) రెండు రోజుల ముందు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో ప్రపంచంలో మైనింగ్ రంగంలో మహిళల పాత్ర ఫలితంగా ఉందని తెలిపారు. మైనింగ్ లో 8 నుంచి 10శాతం లోపు మహిళల భాగస్వామ్యం ఉందని సీతక్క అన్నారు.
అందుకే మైనింగ్ రంగం(Mining sector)లో మహిళలను ప్రోత్సహించాలని కేంద్రప్రభుత్వాన్నికోరారు. సమాన పనికి సమాన వేతనము కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారని చెప్పారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని వెల్లడించారు. అంతరిక్షంలోనే కాదు కాదు భూగర్భంలో కూడా మహిళలు పనిచేయగలరని తెలిపారు. సమాజ కట్టుబాట్ల వల్ల మహిళలు ముందడుగు వేయలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకే మహిళలను అంతా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ పెద్దల దాకా అందరూ మహిళలను ప్రోత్సహించాల కోరారు. మహిళా సంక్షేమం శ్రేయస్సు కోసం కేంద్రం కూడా ఎక్కువగా బడ్జెట్ కేటాయించాలని మంత్రి సీతక్క(Seethakka) ఈ సందర్భంగా కోరారు.