మందమర్రి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మొయ్య రాంబాబు మాట్లాడారు. విద్యార్థులు రాజ్యాంగం విలువలు తెలుసుకునే విధంగా పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని చెప్పి ఆర్టికల్స్ 448 షెడ్యూల్ 12 లేదా 22 భాగాలుగా విభజించినారని, ఆర్బిఐ రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య కారకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం ఎంతో పర్వదినం అని, ప్రతి ఒక్క వర్గానికి, కులాలకు సబ్బండ వర్గాలకు ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగం విలువలు తెలుసుకోవాలని కోరారు. న్యాయశాఖ దినోత్సవం ఇంతకు ముందు కూడ నిర్వహించేవారని, 2015లో ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చి రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, రాజ్యాంగంలో ఉన్న ఇంప్లిమెంట్లు 20 శాతం అభివృద్ధి జరిగితే నిరుపేదలు కనిపించరని, అన్ని ఇంప్రూవ్మెంట్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నేరువట్ల శ్రీనివాస్, జమాల్పురి నర్సోజి, దాసరి రామన్న, బండారి రవి,రాజు, రంజిత్,కోడం శ్రీనివాస్, నాగుల దుర్గయ్య,కే శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.