calender_icon.png 11 January, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు

10-01-2025 11:24:01 PM

పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్...

సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారని, ధనుర్మాసంలో సూర్యుడు దనస్సులోకి ప్రవేశించిన సమయంలో వచ్చిన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి చేరుకోవడం జరుగుతుందన్నారు. భక్తి శ్రధ్ధలత స్వామివారిని ఈ రోజు కొలవడం వలన పుణ్యఫలాలు లభిస్తాయన్నారు. ఈ పర్వదినం పురస్కరించుకోని లోకకల్యాణం జరగాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్ సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, ఆలయాధికారులు ఉన్నారు.