18-02-2025 06:22:46 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఇల్లందు క్రాస్ రోడ్డు హరిత కన్వెన్షన్ హాల్, ఉదయం నిర్వహించే అధికారిక సేవాలాల్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని గిరిజన సంఘం నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. హరిత హోటల్ ప్రాంగణంలో జరిగే శ్రీశ్రీశ్రీ సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలకు బంజార జాతి బిడ్డలు మాజీ MPTCలు, మాజీ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు గిరిజన సంఘ గిరిజన నాయకులు ప్రజా సంఘాల ఉద్యమకారులు ఉద్యోగులు విద్యార్థులు మేధావులు సంత్ శ్రీ సాధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.