calender_icon.png 2 January, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతోషాలతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలి

30-12-2024 10:24:00 PM

డిసెంబర్ 31 రోజున విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్

డీజేలు, బాక్స్ లు వినియోగిస్తే కఠిన చర్యలు

సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ ప్రజలు సంతోషాలతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని పట్టణ సీఐ కె.శశిధర్ రెడ్డి కోరారు. నూతన సంవత్సర వేడుకలు  సమీపిస్తుండటంతో సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్కిల్ పరిధిలోని మందమర్రి, కాసిపేట, రామకృష్ణపూర్, దేవాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీస్ శాఖ తరపున తగిన భద్రత చర్యలు చేపట్టడం  జరుగుతుందన్నారు. డిసెంబర్‌ 31న పట్టణ, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహిస్తామని, నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఏర్పాటు చేసే  కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలని, అలాగే ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా డిజే లు, అధిక శబ్దం వచ్చే బాక్స్ లు ఏర్పాటు చేస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఈనెల 31న టపాసులు, మైకులు అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, మద్యం మత్తులో వాహనాలు నడపడం, ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుందన్నారు. న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకులపైన కేసులు నమోదు చేస్తామన్నారునూతన సంవత్సరం వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని కోరారు.