సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజురవీంద్రచారి
అబ్దుల్లాపూర్మెట్: సీపీఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల సమితి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ఆదివారం రావినారాయణరెడ్డి కాలనీ ఫేస్–3 నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా రవీంద్రచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో అమర వీరుల రక్త తర్పనంతో..శ్రామిక రాజ్యం ఏర్పాటు కోసం ఆవిర్భావించిన పార్టీ సీపీఐ అని అన్నారు. డిసెంబర్ 26తో 100 సంత్సరాలులు పూర్తయిందని.. పార్టీ ఆశయాల బాటలోని ప్రతి సభ్యుడు నియమ నిబంధనలు పాటిస్తూ, ఎర్రజెండా రాజ్యం కోసం కృషి చేయాలన్నారు. అలాగే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అలాగే 2025 పార్టీ సభ్యత్వం పునరుద్దరణ, నిధి వసూళ్లు కార్యక్రమం నిర్వహించాలన్నారు. యువత రాజయకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణ కోసం అసమానతలు లేని సమాజం నిర్మాణం కోసం నేటి యువత పరితపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్మీర్ హరిసింగ్నాయక్, నాయకులు కేతరాజు నర్సింహా, దిగోజు వేణుగోపాల్, కాటి అరుణ, వట్టి నవనీత, తగిలి మధు, మండల కార్యవర్గ సభ్యులు యేశాల నర్సింహా, నారాయణరెడ్ది, పుల్లయ్య, నారాయణ, రాజు గౌడ్, డౌల రాములు, ఆమనగంటి వెంకన్న, ఈ శ్వరయ్య, నిరంజన్, యాదగిరి, రాముడు, చింత వెంకటేశ్, వినోద్, చందన, సుజాత, దేవమ్మ, వీరేశ్, 40 కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.