calender_icon.png 11 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ ఉత్సవాలను జయప్రదం చేయండి

31-12-2024 06:18:03 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...

నిర్మల్ విజయక్రాంతి): ప్రజాపాలన ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో జనవరి 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వాణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో నిర్వహించే ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తమ స్టాండ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో ప్రాధాన్యత గల ప్రతి వస్తువులు బొమ్మలు కలలు చిత్రకళలు వ్యవసాయ ఉత్పత్తులు పుస్తకాలు హస్తకళలు తదితర వాటిని ఈ ఉత్సవంలో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు ఉన్నారు.