calender_icon.png 26 February, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

26-02-2025 04:53:20 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలంలో ఉన్న పలు గ్రామాలలో ఉన్న శివాలయం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద వేద పండితులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద ఉదయం నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూ లైన్ లో ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. చేగుంట పట్టణ కేంద్రంలో ఉన్న శివాలయం వద్ద వివిధ పార్టీల జిల్లా, మండల నాయకులు, స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్ లు అన్ని ఏర్పాట్లు చేశారు.