13-03-2025 12:52:54 AM
శాంతి, భద్రతలకు విఘాతం కలిగించకూడదు జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ మార్చి 12 (విజయ క్రాంతి) : ఇండ్ల 14వ తేదీన ఉదయం 6 గంటల నుండి 12 గంటల్లో పులి వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. హోలీ పండుగ వేడుకల్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకూడదని పేర్కొన్నారు. రోడ్లపై ప్రజలను ఇబ్బందుల గురి చేయకూడదని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వేడుకలను సంతోషంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పేర్కొన్నారు.