calender_icon.png 13 April, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జయంతి వేడుకలు జయప్రదం చేయండి

12-04-2025 08:30:31 PM

అంబేద్కర్ జయంతిని సమాజ చైతన్యానికి మార్గదర్శకంగా మార్చండి..

జేబీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెర్రా కామేష్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈ నెల 14న జరగనున్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కోరారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి కేవలం ఒక వేడుకగా కాకుండా, సామాజిక న్యాయం, సమానత్వం, మానవీయ విలువల పోరాటానికి గుర్తుగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో తిరుగులేని మహా నాయకుడని, ఆయన తన జీవితం మొత్తం వివక్షకు గురైన వర్గాల ఆకాంక్షలకు, హక్కుల కోసం పోరాటానికి అంకితమయ్యారు.

రాజ్యాంగ నిర్మాతగా ఆయన వహించిన పాత్ర దేశానికి దారి చూపింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఆయన కల – అది నేడు కూడా శక్తివంతమైన మార్గదర్శకమని, ఏప్రిల్ 14న ఉదయం 10 గంటలకు కొత్తగూడెం పట్టణంలోని డా. బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ప్రారంభమవుతాయని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు ఐపీఎస్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ వేడుకలకు న్యాయవాది మారపాక రమేష్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాలు, జేబీపీ, వివిధ పార్టీల నాయకులు, సామాజిక ఉద్యమకారులు, మహిళా నాయకురాళ్లు, విద్యార్థి సంఘాలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

డా.అంబేద్కర్ జీవితం ఓ మహాగాధ అనేక అవమానాలను ఎదుర్కొంటూ, వాటిని జ్ఞానంగా మలచుకుని, కోట్ల మంది నిరుపేదలకు ఆశాకిరణంగా మారిన యోధుడు ఆయన జయంతి మనం ఒక్కరోజు గౌరవించాల్సిన వేడుక మాత్రమే కాదు – అది మన జీవిత విధానమై మారాలని పిలుపుచ్చారు. అందరూ కలసికట్టుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనవంతం చేయాలని, అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, నున్న శివ చౌదరి, వినయ్, బాబీ, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.