వీ హనుమంతరావు
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాం తి): రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ కూడా ఈ అంశానికి మద్ద తుగా ఉన్నారని తెలిపారు. శనివారం ఆయ న గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. సీలింగ్ ఎత్తివేస్తేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు.
రాహుల్‌గాంధీ ప్రధాని కాగానే పార్లమెంట్‌లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం పొందుతుందని అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీ, దళిత బంధు, రైతు బంధు ఇచ్చామని చెబుతున్న బీఆర్‌ఎస్.. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణా లను ఎందుకు విశ్లేషించుకోవడం లేదో తెలియడం లేదన్నారు.