నారాయణఖేడ్, జనవరి 10: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకన్నను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి వారి కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గం లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవునితో వేడుకోవడం జరిగిందన్నారు. ఆయన వెంట డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, అనురాగ్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, పాండురంగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.