28-04-2025 01:07:45 AM
సిద్దిపేట, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను పా టించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన స మావేశంలో వారు మాట్లాడుతూ మధ్య భారత దేశంలోని దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలన్నారు.
ఆదివాసులపై జరుగుతున్న మరణ హోమా న్ని దాడిని నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా కర్రే గుట్టలో మావోయిస్టులు ఉ న్నారు అనే సమాచారంతో కేంద్ర పారా మిలిటరీ బలగాలు వివిధ రాష్ట్రాల బలగాల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న బలగాలను నిలిపివేస్తూ వెంటనే వెనక్కి పంపాలన్నారు.
తన దేశ పౌరుల పైన యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని దేశ సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి సైనికులు దండకారణ్యంలో ఆదివాసులపై యుద్ధం చేయడం అప్రజాస్వామీకం అన్నారు. మరొక ప్రక్క ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మావోయిస్టులు ప్రకటించారు.
కానీ ప్రభుత్వ వైపు నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడం వెనుక కార్పొరేట్ శక్తులు,బహుళ జాతి కంపెనీలు ఉన్నాయన్నారు. ఈ దేశ సంపదను కాపాడుకోవడం కోసం ఆదివాసులకు మద్దతుగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో టిపిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి .సత్త య్య, జిల్లా అధ్యక్షుడు జే నరసింహులు, పౌ ర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు రాగుల భూపతి, ప్రధాన కార్యదర్శి జే శ్రీనివాస్, భా స్కర్ పిడిఎం జిల్లా అధ్యక్షులు దుర్గ రా ములు, డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బాకీ చంద్ర భాను, చిల్లా నర్సింలు, బహుజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ రోమాల బాబు, నర్సింలు ,ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ కీసర ఎల్లం ,ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు షాదుల్లా, పౌర హక్కుల సంఘం నాయకుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు.