calender_icon.png 20 January, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం

20-01-2025 12:00:00 AM

హమాస్ చెర నుంచి ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు విడుదల

న్యూఢిల్లీ, జనవరి 19: ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విర మణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం ఇజ్రాయెల్‌కు చెందిన ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేసింది. గాజాకు చేరుకున్న రెడ్‌క్రాస్ ప్రతినిధులకు ఇజ్రాయెల్‌కు చెందిన బందీలను అప్పగించింది. రెడ్‌క్రాస్ ప్రతినిధులు వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు.

హమాస్ నుంచి విడుదలైన వారిలో రోమి గోనెన్, ఎమిలీ దమారీ, డోరాన్ స్టెయిన్‌బ్రేచర్‌లు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు అమల్లోకి రావాల్సిన కాల్పుల ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. హమాస్ నుంచి ఇజ్రాయెలీ బందీల జాబితా విడుదలలో ఆసల్యం కారణంగా ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది.