calender_icon.png 20 April, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పులకు విరామం

20-04-2025 12:38:37 AM

నేటి రాత్రి వరకూ విరమణ పాటించాలని సైనికులకు పుతిన్ ఆదేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఉక్రెయిన్‌పై భీకరదాడులు చేస్తున్న రష్యా కాల్పులకు కాస్త విరామం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏప్రిల్ 19 సాయంత్రం నుంచి ఆదివారం వరకు కాల్పులు జరపొద్దని తమ సైన్యానికి సూచించారు. ఈస్టర్ నేపథ్యంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నా రు.

ఉక్రెయిన్ కూడా ఈస్టర్ వేళ కాల్పుల విరమణను పాటిస్తుందని తాను ఆశిస్తున్నట్టు పుతిన్ పేర్కొన్నారు. ఇందుకు సంబం ధించి చీఫ్ రష్యా జనరల్ స్టాఫ్ గెరాసిమోవ్‌కు ఆదేశాలిచ్చారు. రష్యా క్రిస్మస్ సంద ర్భంగా కూడా ఇలాగే తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది.