calender_icon.png 27 April, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ కవ్వింపు చర్యలు

27-04-2025 12:46:57 AM

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

వరుసగా రెండు రోజుల నుంచి కాల్పులు 

అప్రమత్తమైన భారత సైన్యం.. ప్రతిగా ఫైరింగ్

శ్రీనగర్, ఏప్రిల్ 27:  జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం భార త్, పాకిస్థాన్ మధ్య పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పాక్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు నుంచే భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ముష్కరుల దాడి తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రెండు దేశాల సరిహద్దు ఎల్వోసీ (నియంత్రణ రేఖ) వెంబడి అలజడి కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ సైనికులు వరుసగా రెండోరోజు శనివారం కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించారు.

భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక శుక్రవారం అర్ధరాత్రి ఎల్వోసీ అంచున కాల్పులకు దిగారు. దీంతో భారత్ కూడా ఎదురుదాడికి దిగింది. అయి తే.. కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది.  ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం మళ్లీ కాల్పులు జరిపే అవకాశం ఉండటంతో భారత సైన్యం భారీగా ఆ ప్రాంతంలో మోహరించింది. కేం ద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

సింధూ జలాల నిలిపివేత.. ప్రణాళికలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భార త్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందానిన రద్దు చేసింది. పాక్‌కు ఒక్క చుక్కనీరైనా చేరకుండా దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు అనే మూడు దశల ప్రణాళిక అమలు చేయనున్నది. జలా ల నిలిపివేతతో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుంది.  ఇకపై నదికి సంబంధించిన అంశంపై భారత్ ఎలాంటి బాధ్యత వహించదు.  సట్లెజ్, బియాస్, రావి, సింధూ, జీలం, చీనాబ్ వరదలు, జలాల వినియోగంపైనా ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవస రం లేదు.

ఒప్పందం ప్రకారం పశ్చిమాన ప్రవహించే నదులపై భారత్ జలవిద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై పాక్‌కు అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉండేది. ఒప్పందం రద్దు కారణంగా పాక్ ఆ హక్కును కూడా కోల్పోయినట్లే. సింధూ జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగింది కాబట్టి.. ఒకవేళ పాక్  ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదుకు వెళితే.. ఆ పరిణామాలను సైతం సమర్థంగా ఎదుర్కొంటామని ఇప్పటికే భార త్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హో మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉన్నతస్థాయి సమావేశంలో ఆయా నదులపై ఉన్న ఆనకట్టల పూడికతీత, జలాల మళ్లింపు, కొత్త ఆనకట్టల నిర్మాణంపై కీలకమైన చర్చ జరిగింది.

నేపాల్, యూకే, ఆస్టేలియాలో నిరసనలు

పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా యూకే రాజధాని లండన్, నేపాల్ రాజధాని ఖాఠ్మాండు, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయాల ఎదు ట ప్రవాస భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లకార్డులు చేబూని పాక్థిసాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ ప్రభు త్వం ఆ దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నదని, వారికి ఆర్థికపరమైన సహా య సహాయక సహకారాలు అందిస్తున్నదని ఆరోపించారు. 

ఐరాస ఖండన

పహల్గాంలో ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు 15 దేశాలకు చెంది న సభ్యులతో కలిసి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దాడికి బాధ్యులైన వారితో పాటు ప్రేరేపించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని అభిప్రాయప డింది. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి ముప్పేనని ఉద్ఘాటించింది. 

ఎలాంటి పరిణామాలనెనా ఎదుర్కొంటాం : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ్లమెల్లగా మౌనం వీడుతున్నారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణ యం తాలుకు పర్యావసనాలు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిం చారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మున్ముందు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. 

‘పహల్గాం ఘటనతో పాక్ నిందలు మోస్తున్నది. కానీ.. మా దేశం శాంతినే కోరుకుంటుంది. చర్చల ద్వారా రెండు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం’ అంటూ పరోక్షం గా భారత్‌ను దెప్పిపొడిచే వ్యాఖ్యలు చేశారు. 

ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు బ్లాస్ట్

భారత భద్రతా దళాలు శనివారం కశ్మీర్‌లో ని ఐదుగురు ఉగ్రవాదుల ఇండ్లను పేల్చివేశా యి. ఇండియన్ ఆర్మీ షోపియాన్‌లోని చోటిపొరాలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్, మతాలంలో ఉగ్రవాదులు జాహిద్, ఇషాన్ అహ్మద్, కుల్గాం ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్ హక్, పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో ని హరీస్ అహ్మద్ నివాసాలను పేల్చివేసింది. పహల్గాంలో పర్యాటకుల కు పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరైన ఆదిల్ హు స్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్‌షేక్ ఇండ్లను ఐఈడీ, బుల్డోజర్‌తో శుక్రవారం నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి ఇళ్ల లో అప్పటికే బాంబులు అమర్చి ఉన్నాయని, జవాన్ల ట్రాప్ కోసమే వాటిని అమర్చి ఉంటారని దళాలు అనుమానిస్తున్నారు.


పాక్ మొసలి కన్నీరు: కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై తటస్థ విచారణ చేపడతామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ‘ కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకే పాక్ పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు. పాక్ ప్రధాని షరీఫ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. తమపై వస్తున్న ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకే ఇప్పుడు భారత్‌పై నిందలు వేసేందుకు పూనుకున్నారు. నిన్నమొన్నటి వరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఇప్పుడు తటస్థ విచారణ చేయిస్తామంటే నమ్మడానికి మేం సిద్ధంగా లేం. ఉగ్రదాడిని కనీసం పాక్ గుర్తించలేదు. పైగా దాడి వెనుక భారత్ ఉందని మొదట ఆరోపించింది. ఇప్పుడు రూట్ మార్చి మరోలా వ్యాఖ్యలు చేస్తున్నది’ అంటూ మండిపడ్డారు.

సింధూ జలాలు ఆపితే.. భారతీయుల రక్తం ప్రవహిస్తుంది : పీపీపీ చీఫ్ బిలావల్

‘సింధూ నదిలో నీరైనా పారుతుం ది.. లేదంటే పాకిస్థాన్ ప్రత్యర్థుల రక్తమైనా పారుతుంది’ అంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ తాజాగా భారత్‌ను ఉద్దేశిస్తూ నోరుపారేసుకున్నారు. సింధూ ఎప్పటికీ తమదేనని, నిజమైన నది పరిరక్షకులు, సింధూ నాగరికత వారసులు తామేనంటూ వ్యాఖ్యానించారు.

“మేం ఇప్పటికీ మా దేశంలో చేతిలో బాధితులం. భారత్ కొత్తగా మమ్మల్ని బద్నాం చేస్తుందనుకోవడం హాస్యాస్పదం. మాకు సింధూ జలాలను నిలిపివేస్తారా? అవి ఎటూ మాకు రావడం లేదు. లేదంటే చంపుతారా? మా దేశం చేతిలో మేం రోజూ చస్తూనే ఉన్నాం. లాహోర్‌ను తిరిగి భారత్‌లో కలుపుకొంటారా? అరగంటలో భారత్ మాకు తిరిగి లాహోర్‌ను ఇచ్చేస్తుంది”

- ఓ సగటు పాకిస్థానీయుడి ఆవేదన