హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): ఎస్పీడీసీఎల్ రంగారెడ్డి జోన్ పరిధిలో రానున్న వేసవి కాలంలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సర అందించేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ ఇంజినీర్ ఎల్ పాండ్యా అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గచ్చిబౌలిలోని సీఈ కార్యాలయంలో ఎస్‌ఈలు, డీఈలు, ఏడీ సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ పాండ్యా మాట్లాడుతూ గతేడాది వేసవిలో 1,800 మెగావాట్ల డిమాం 35 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైనట్లు తెలిపారు.
ఈ ఏడాది అదనంగా మరో 25 శాతం పెరిగి మొత్తం 2,250 మెగావాట్ల డిమాండ్‌కు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో పెరగనున్న విద్యు వినియోగం లోడ్‌ను తట్టుకునేలా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.