calender_icon.png 31 October, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీడీపీవో డబ్బు వసూళ్లు వాస్తవమే!

31-10-2024 12:01:08 AM

  1. అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు బేరం
  2. డీడబ్ల్యూవో విచారణలో వెల్లడి

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఉద్యోగాల పేరుతో డబ్బు వసూ ళ్లకు పాల్పడుతున్న టేకులపల్లి సీడీపీవో మంగతాయారు తీరుపై ఇటీవల ‘అంగట్లో అంగన్‌వాడీ ఉద్యోగాలు’ అన్న శీర్షికన ‘విజయక్రాంతి’లో ప్రచురితమైన కథనానికి కలె క్టర్ జితేశ్ వీ పాటిల్‌తో పాటు ఐసీడీఎస్ ఉన్నతాధికారులు స్పందించారు.

వారి ఆదేశాల మేరకు బుధవారం డీడబ్ల్యూవో లెనీ నా బుధవారం గుండాల మండలం కేంద్రం లో విచారణ చేపట్టారు. కోనేరుగూడెం అంగన్‌వాడీ టీచర్ కొలువు పేరు చెప్పి సీడీపీవో డబ్బు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో సీడీపీవో తప్పు జరిగినట్లు అంగీకరించి సీడీపీవో తీసుకున్న పైకాన్ని తిరిగి చెల్లించారు. వసూలుకు సహకరించిన ఇద్దరు అంగన్‌వాడీ టీచర్ల నుంచి డీడబ్ల్యూ వో సంజాయిషీ కోరారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తానని డీడబ్ల్యూవో తెలిపారు.