calender_icon.png 30 October, 2024 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండ కమిషనర్‌కు సీడీఎంఏ మెమో

30-10-2024 12:00:00 AM

ఎండోమెంట్ స్థలంలో సీసీ రోడ్డు వేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం

రాజేంద్రనగర్, అక్టోబర్29: ఎండోమెంట్ స్థలంలో సీసీ రోడ్లు వేశారనే ఆరోపణల నేపథ్యంలో మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్‌కు సీడీఎంఏ మెమో జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు..

మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామంలోని గణేశ్ టెంపుల్‌కి సంబంధించిన సర్వే నంబర్ 112లో గోగిలిన్ కాలనీలో ఎండోమెంట్‌కు సంబంధించిన భూముల్లో కొన్నిరోజుల క్రితం రాత్రికిరాత్రే మున్సిపాలిటీ నిధులతో సీసీ రోడ్లు నిర్మించారు. అదేవిధంగా అక్కడ కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించారు.

ఈ విషయమై అప్పట్లో స్థానికుడు మామిళ్ల వెంకట్ సీడీఎంఏ అధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో అధికారులెవరూ ఈ విషయమై పట్టించుకోలేదు. తాజాగా దీనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని సీడీఎంఏ మంగళవారం మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్‌కు మెమో జారీచేసింది.

మెమో విషయమై ప్రదీప్‌కుమార్‌ను వివరణ కోరగా.. విషయం తనకు తెలియదని, తాను ట్రెయినింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. రోడ్డు వేసిన విషయం ఇంజినీరింగ్ విభాగం కిందికి వస్తుందని చెప్పడం గమనార్హం.