హైదరాబాద్ సిటీ, జనవరి 20 (విజయక్రాంతి): ఏపీలోని చిత్తూరు అపోలో యూనివర్సిటీలో సోమవారం వర్సిటీ ఛాన్స్‌లర్, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెషిషన్ మెడిసిన్ (సీడీహెచ్‌పీఎం) విభాగాన్నిప ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి, అపోలో యూకే ఎడ్యుకేషన్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్‌రెడ్డి, అపోలో వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ వినోద్ భట్, ఇతర ప్రతినిధులు డాక్టర్ సుజోయ్ ఖర్, ప్రొఫెసర్ నిశాన్ కనగరాజా, డాక్టర్ రవిరాజు తదితరులు పాల్గొన్నారు.