హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సై అందాం మాల ఒక్కటవుదాం అంటూ రూపొందించిన అరుణో పాట సీడీ, రిజర్వేషన్లు వర్గీకరణ ప్రజాస్వామ్య హక్కు పుస్తకావిష్కరణల కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్ర నిర్వహిస్తున్నట్టు అరుణోదయ సాం సమాఖ్య నాయకురాలు విమలక్క తెలిపారు.
వర్గీకరణే సర్వస్వం కాదంటూనే రిజర్వేషన్లపై స్పందించేలా మాట వరుసకిచ్చిన హక్కుల వాటా జనాభా దామాషా ప్రకారం దక్కాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా సాగుతున్న వర్గీకరణ పోరాటానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మొదటినుంచి మద్దతుగా నిలుస్తుందన్నారు.
ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం సాధించడమంటే అసమానతలు ఉన్న వర్గాలకు సమా అవకాశాలు కల్పించడమే వర్గీకరణ అని విమలక్క స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మాదిగొళ్ల డప్పులొచ్చెనే మానవ హక్కుల దండోరేసి అంటూ అరుణోదయ గళం ద్వారా ఈ సమాజం ముందు ఉంచినట్టు తెలిపారు. కుల నిర్మూలన ప్రాతిపదికపై ఈ సమస్యను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ వర్గీకరణకు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు.