calender_icon.png 6 February, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

06-02-2025 08:23:19 PM

ఎస్సై రాజశేఖర్...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ ప్రజలు స్వీయరక్షణ కోసం తమ కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలు ద్వారా నేరాలు నియంత్రించవలసిన పట్టణ ఎస్సై రాజశేఖర్ గురువారం పట్టణంలోని పాత బస్టాండ్ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ యాజమాన్యం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించి హోటల్ యాజమాని వెంకన్నను సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ప్రజలు తమ స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, వ్యక్తిగత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న క్రమంలో, కనీసం ఒక్క కెమెరా అయినా బయట ప్రదేశాన్ని, రోడ్డును కవర్ చేసే విధంగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పాత బస్టాండ్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.