27-03-2025 12:41:23 AM
చేవెళ్ల, మార్చి 26: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ భూపాల్ శ్రీధర్ సూచించారు. చేవెళ్ల మండలం రావుల పల్లిలో గత రెండేళ్లుగా పనిచేయని సీసీ కెమెరాలను మాజీ సర్పంచ్ రామచంద్రయ్య గౌడ్ బాగు చేయించారు. బుధవారం ఈ సీసీ కెమెరాలను పంచాయతీ కార్యాలయంలో ఎస్త్స్రలు శ్రీకాంత్ రెడ్డి, సంతోశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఉపయోగ పడుతాయని, దొంగలను పట్టుకునేందుకు ఈజీగా ఉంటుందన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. 18 ఏండ్లు నిండిచి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంచంద్రయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నాగి రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, మాజీ వార్డ్ సభ్యులు కావలి సత్యనారాయణ, చందనెల్లి అశోక్, చాకలి జంగయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.