calender_icon.png 13 March, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి

11-03-2025 08:56:02 PM

ఏఎస్పీ చైతన్య రెడ్డి...

కామారెడ్డి (విజయక్రాంతి): గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ బొక్క చైతన్య రెడ్డి సూచించారు. మంగళవారం ఆమె భిక్కనూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి పెండింగ్ ఫైళ్లను పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు లేని చోట, వెంటనే కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

దొంగతనాలు జరగకుండా రాత్రివేళ పెట్రోలింగ్ ను ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసు వివరాలు పరిశీలించిన ఆమె, ఆధునిక సాంకేతికతను వినియోగించి కేసులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్ ఐ డి ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.