21-02-2025 05:32:04 PM
సీఐ శశిధర్ రెడ్డి..
మందమర్రి (విజయక్రాంతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు నేరాలు నిరూపంలో సైతం కీలకంగా నిలుస్తున్నాయని సీఐ శశిధర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో కాలనీవాసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, ఒకవేళ ఏ చిన్న సంఘటన జరిగిన సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చన్నారు.
కేసుల ట్రయల్ సమయంలో సీసీ కెమెరాల సాక్షాలు ఎంతో ఉపయోగపడతాయనీ తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, సీసీ కెమెరాలు 24 గంటలు ప్రజలకు రక్షణ కల్పిస్తాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేసిన కాలనీ వాసులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, కాలనీవాసులు పాల్గొన్నారు.