calender_icon.png 8 January, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర

07-01-2025 07:37:56 PM

సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి...

మందమర్రి (విజయక్రాంతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పట్టణ సీఐ కె శశిధర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని అంగడి బజార్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున పట్టణ సీఐ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా, కాలనీలో తనిఖీలు నిర్వహించి సరైన ద్రువపత్రాలు లేని 34 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, కాలనీలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత చెడు అలవాట్లకు ముఖ్యంగా గంజాయి, మద్యం, డ్రగ్స్ కు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

గంజాయి, మత్తు పదార్థాలు ఉండే అనుమానాస్పద ప్రదేశాలలో నార్కోటిక్ డాగ్ తో పరిశీలించారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. కాలనీలలో స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని దీనికి పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

10 లీటర్ల గుడుంబా పట్టివేత....

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలో తనిఖీలు నిర్వహిస్తుండగా అంగడి బజార్ కి చెందిన ఒక మహిళ ఇంటిలో ఐదు లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబా గుర్తించామని గుడుంబాను స్వాదీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. అదేవిధంగా గూడెంకు చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ నిషేధిత గుడుంబా అమ్మడానికి రాగా అతని దగ్గర నుండి ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.