calender_icon.png 13 March, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి

12-03-2025 09:04:38 PM

బీఎన్  రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి 

చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్ పనుల పరిశీలన 

ఎల్బీనగర్: చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని, ఇందుకోసం బీఎన్ రెడ్డి నగర్(BN Reddy Nagar) డివిజన్ లో చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్లు కార్పొరేటర్ లచ్చిరెడ్డి(Corporator Lachi Reddy) అన్నారు.  బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్-1 పార్కులో రూ.21 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్, ఓపెన్ జిమ్ ను  బుధవారం కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ... బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్-1 పార్కులో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్, ఓపెన్ జిమ్ పరికరాలను పర్యవేక్షించినట్లు తెలిపారు. త్వరలోనే కాలనీ అభివృద్ధి పనులను చేపడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, ధనరాజ్, లక్ష్మారెడ్డి, భిక్షపతి, నవీన్, రాములు, రవి, పెంటారెడ్డి, జలంధర్ రెడ్డి, కాశిరెడ్డి పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో సీసీ కెమెరాలు ప్రారంభం 

బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్ -1 కాలనీలో సంక్షేమ సంఘం భవనం, పోచమ్మ, శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కార్పొరేటర్ లచ్చిరెడ్డి ప్రారంభించారు. కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్తంభాల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కాలనీవాసులు కోరారు. కార్యక్రమంలో వనస్థలిపురం సీఐ  శ్రీనివాస్, ఎస్సై రవి నాయక్, కాలనీ అధ్యక్షుడు పురుషోత్తమ రెడ్డి, పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, సభ్యులు ధనరాజ్, లక్ష్మారెడ్డి, భిక్షపతి, నవీన్, రాములు, రవి, పెంటారెడ్డి, జలంధర్ రెడ్డి, కాశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.