calender_icon.png 30 March, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలు ప్రారంభించిన

24-03-2025 12:59:53 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం, మార్చి23 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ నవయుగ కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా  సీసీ కెమెరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు మంచి ఫలితాలు ఇస్తుందన్నారు.సీసీ కెమెరాలు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల భద్రతను మరింత మెరుగుపరిచే ప్రయత్నాలు అభినందనీయమైనని కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, స్వర్ణ గంటి అర్జున్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి పాల్గొన్నారు.