calender_icon.png 26 March, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాల్లో సీసీ కెమెరాలు..

25-03-2025 08:40:14 PM

బూర్గంపాడు/అశ్వాపురం (విజయక్రాంతి): ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధుల్లో, దుకాణాల్లో, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే సాంకేతిక సాధనం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన మహిళా రైతు పడిదం వరలక్ష్మి తన కూరగాయలు చేనులో దొంగల భారీ నుండి తప్పించుకునేందుకు తన కూరగాయలు పండించే వ్యవసాయ పొలంలో సోలార్ తో సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళ రైతు పడిదం వరలక్ష్మి మాట్లాడుతూ.. నీళ్ల మోటర్ ను, దిగుబడి వచ్చే సమయంలో కొందరు దొంగలు పంటను ఎత్తుకెళుతున్నారని దీంతో నష్టపోతున్నమని, వారి నుంచి పంటను కాపాడుకునేందుకు పొలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి పంటను రక్షించుకుంటున్నామని తెలిపారు.