ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ శ్రీనివాస రంగాపురం కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి మాట్లాడుతూ... సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీనివాస రంగాపురం కాలనీవాసులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో అన్ని కాలనీల ప్రతినిధులు వారి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. మహిళలు, ప్రజల రక్షణ, దొంగతనం వంటి వివిధ నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాల పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కయాంజాల్ కౌన్సిలర్లు ధనరాజ్ గౌడ్, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, ఐలయ్య, గోపాల్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డి, ఆదిభట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి, మల్ రెడ్డి యాదిరెడ్డి, భీంరెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.