25-03-2025 10:33:00 PM
5 సీసీ కెమెరాలను ప్రారంభించిన జైపూర్ ఏసీపీ..
చెన్నూర్ (విజయక్రాంతి): నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సాయంత్రం జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నూరు క్రాస్ వద్ద కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ ఆటోమేటిక్ 5 సీసీ కెమెరాలను జైపూర్ ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక సీసీ కెమెరా వందమంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రణ చేయవచ్చని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహిళలకు, బాలికలకు ఏమైనా ఇబ్బందులు తలేత్తితే డయల్ 100, స్థానిక పోలీస్ ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్ఐ శ్రీధర్, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.