13-02-2025 02:19:20 AM
కరీంనగర్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): ఆధార్ సర్వర్ డౌన్ వలన పత్తి కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్న దృష్ట్యా సిసిఐ పత్తి కొనుగోలు నిలిపివేసి నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి తెలిపారు. పత్తి కొనుగోలు సమయంలో రైతులకు ఆధార్ ప్రామాణికరణ కావడం లేదని, ఓటి పి కూడా రావడం లేదని పేర్కొన్నారు.
దీం తో జిల్లాలోని కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాల్ రావు పేట పరిధిలో సీసీఐ పత్తి పత్తి కొనుగోలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సీసీఐ కొనుగో లు కేంద్రాలకు పత్తిని తీసుకురావద్దని పేర్కొ న్నారు. తిరిగి ఆధార్ సర్వర్ పునరుద్ధరణ అయిన తర్వాత ఎప్పుడు కొనుగోలు చేసేది ప్రకటిస్తామని తెలిపారు.