calender_icon.png 4 March, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ, ఎయిర్‌పోర్ట్‌పై స్పష్టమైన వైఖరి చెప్పాలి

04-03-2025 12:48:57 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : ఆదిలాబాద్‌లో సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పాటు ఎయిర్ పోర్ట్ పై స్థానిక బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు స్పష్టమైన వైఖరి చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు...సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపై కేవలం ఎంపీ, ఎమ్మెల్యే ప్రకటనలకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గతంలో బీఆర్‌ఎస్ రాష్ర్ట ప్రభుత్వంపై నిందలు వేసిన స్థానిక బీజేపీ నాయకులకు సీసీఐ పునరుద్ధరణ విషయంలో ఇప్పుడు ఎవరు అడ్డం వస్తున్నారో తేల్చి చెప్పలేక నీళ్లు మింగుతున్నారన్నారు.

ఆదిలాబాద్ జిల్లా యువతకు ఎన్నికల ముందు సీసీఐ రీఓపెనింగ్ చేసి 5,6 వేల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి నేడు ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేయడానికి ఈ టెండర్లు పిలవడం జరిగిందన్నారు. సీసీఐ ప్రస్తావన కోర్ట్ కేసులో ఉన్నప్పటికిని టెండర్ లకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు.