03-04-2025 12:00:00 AM
కేంద్ర మంత్రి కుమారస్వామికి సమితి నేతల వినతి
ఆదిలాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని సిమెంట్ పరిశ్రమ (సీసీఐ) పునరుద్దరణ కోసం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మలిదశ ఉద్య మం ఆదిలాబాద్ నుంచి ఢిల్లీకి పాకింది. సీసీఐ పునరుద్ధరణకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గత 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సాధన సమితి సభ్యులు, బుధవారం ఢిల్లీలో నిరసన తెలిపారు.
జంత ర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న, రాజ్య సభ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ సురేశ్‌రెడ్డి, డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, దామోదర రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సీసీఐ సాధన సమితి సభ్యులు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందించి సీసీఐ పరిశ్రమ గురించి క్లుప్తంగా వివరించారు.
నాటి ముఖ్యమం త్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వం లో కేంద్రానికి అనేక సార్లు విన్నవించడం జరుగిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్దరణ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ప్రతి ఎన్నికలు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే లను గెలిపిస్తే సీసీఐని ప్రారంస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో - కన్వీనర్ విజ్జగిరి నారాయణ, అరుణ్ కుమార్, గుడిపెల్లి నగే ష్, లోకారి పోశెట్టి, కొండ రమేష్, జగన్, సిర్ర దేవేందర్, వెంకట నారాయణ, బొజ్జ ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.