calender_icon.png 19 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఉద్యమాలకు సిద్ధం

19-03-2025 02:29:02 AM

ఆదిలాబాద్, మార్చ్ 18 (విజయ క్రాంతి) : ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆదిలాబాద్ లోని సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలి అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని పున:ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమయ్యారు. స్థానికంగా మంగళవారం అఖిలపక్షం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఈనెల 19వ తేదీ నుండి కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు.   ఈ సందర్భంగా సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ   జిల్లా ప్రజలు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను గెలిపించిన జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించగా పోవడం బాధాకరం అన్నారు.

సీసీఐ పరిశ్రమను పునర్ ప్రారంభించాలని ఒక పక్క జిల్లా ప్రజలు పోరాడుతుంటే, బీజేపీ ప్రభుత్వం మరో పక్క తుక్కు కింద ఫ్యాక్టరీని అమ్మేయడం కోసం  ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సీసీఐ సాధన కోసం మలిదఫా ఉద్యమాన్ని రేపటి నుండీ ప్రారంభించనున్నట్టు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు