calender_icon.png 22 November, 2024 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దతు ధర కోసం సీసీఐ కేంద్రాలు

23-10-2024 12:50:44 AM

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి 

ఖమ్మం, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతు సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి  అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు.

పత్తి రైతులు దళారుల చేతిలో మోసపోకుం డా తెలంగాణ వ్యాప్తంగా సీసీఐ కేంద్రాలు ప్రారంభించినందుకు  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా రూ.౫౦0 బోనస్ ఇవ్వాలని కోరారు.

ఖరీఫ్ ముగిసే దశకు చేరుకున్నా ఇంతవరకు రైతు భరోసా  ఇవ్వకుండా.. మంత్రులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు  కిరణ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడువెంకటేశ్వర్లు, మందా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.